బాలీవుడ్ నటి కరీనాకపూర్ ఈ మధ్య విదేశాల్లో కుటుంబంతో సహా గడిపొచ్చింది. ఇందులో విశేషం ఏమీలేదు. కానీ ఆమె ధరించిన చానెల్ హ్యాండ్‌బాగ్ అందరినీ ఆకర్షించింది. దీని ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా 3 లక్షల 65 వేల రూపాయలు.
ఇప్పుడు ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగవైరలవుతోంది. అంటే ఒక సామాన్య ఉద్యోగి సంవత్సర కాలం సంపాదనతో సమానమన్నమాట. కరీనా సొంత డబ్బులతో బ్యాగ్ కొంటే జనాలకేంటి నష్టం అని కొంతమంది అంటే, మరి కొంతమంది ఆ సొమ్ములన్ని జనాలవే కదా అని అంటున్నారట.