బాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న హీరోయిన్ కరీనా కపూర్.. తాజాగా రచయిత అవతారమెత్తారు. 'కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో ఓ పుస్తకాన్ని రాసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో గర్భిణీలకు సంబంధించిన అంశాలను కరీనా పొందుపర్చనున్నారు. తన కుమారుడు తైమూర్ అలీఖాన్ నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు కరీనా. వచ్చే ఏడాదిలో పుస్తకాన్ని విడుదల చేస్తానని తెలిపారు.
"నా పుస్తకం 'కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీ బైబిల్' గురించి చెప్పేందుకు ఇదే సరైన రోజు. ఇందులో తల్లులకు సంబంధించిన అన్ని విషయాలను నేను వివరిస్తా. దీన్ని మీ అందరి ముందుకు తొందరగా తీసుకురావాలనుకుంటున్నా. జగ్గర్నాట్ బుక్స్ సంస్థ 2021లో నా పుస్తకాన్ని విడుదల చేస్తుంది."