బాలీవుడ్ స్టార్ హీరో కరీనా కపూర్.. రామాయణంలోని సీత పాత్రలో నటించేందుకు ఏకంగా రూ.12 కోట్లు రెమ్యునరేషన్ అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె అంత మొత్తం అడగానికి కారణం ఏంటి? ఓ సినిమాకు సాధారణంగా కరీనా ఎంత తీసుకుంటుంది?
ఇప్పటివరకు తీసినట్లు కాకుండా రామాయణాన్ని, సీతదేవి కోణం నుంచి (పాయింట్ ఆఫ్ వ్యూ) తెరకెక్కించేందుకు దర్శకుడు అలౌకిక్ దేశాయ్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కరీనాను సంప్రదించగా, ఆమె రూ.12 కోట్లు డిమాండ్ చేసిందట.