తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లాలని ఉంది: కరీనా - kareena kapoor complelted 20 years in industry

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కరీనా కపూర్​ వెండితెర అరంగేట్రం చేసి మంగళవారానికి 20 ఏళ్లు. ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలోని అనుభవాల గురించి ఇన్​స్టాలో అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.

kareena
కరీనా

By

Published : Jun 30, 2020, 10:01 PM IST

కరీనా కపూర్​.. తనదైన నటనతో ప్రేక్షకులను ముగ్ధుల్ని చేస్తున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్. వరుస హిట్​ సినిమాలతో దూసుకెళ్తోంది. అయితే ఈ భామ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మంగళవారంతో రెండు దశాబ్దాలు. ఈ సందర్భంగా తన 20ఏళ్ల సినీప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్​స్టాలో ఓ ఫొటోను పోస్ట్​ చేసింది ఈ ముద్దుగుమ్మ.

"నా మొదటి షాట్‌ తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. ఈ రోజు నేను నాలుగు గంటలకు లేచాను. అద్దంలో నా ముఖం చూసుకున్నాను. నేను సినిమాల్లో చేరి మంచి నిర్ణయం తీసుకున్నానని నాకు నేను చెప్పుకున్నా. ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో కృషి, పట్టుదల, అంకితభావం, ఆత్మ విశ్వాసం నన్ను ముందుకు నడిపించాయి. అభిమానుల ప్రేమకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అంతేకాదు నా తొలి సినిమా 'రెఫ్యూజీ' దర్శకుడు జేపీ దత్తాకు, హీరో అభిషేక్‌ బచ్చన్‌తో పాటు చిత్రబృందానికి నా ధన్యవాదాలు. అప్పుడే ఈ చిత్రం ఇరవై సంవత్సరాలు పూర్తిచేసుకుంది. మరోసారి ఆ కాలానికి వెళ్లాలని ఉంది."

-కరీనా కపూర్​, బాలీవుడ్​ కథానాయిక.

కరీనా కపూర్‌ బాలీవుడ్​ అగ్రహీరో సైఫ్‌ అలీఖాన్‌ని పెళ్లి చేసుకొంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమిర్‌ఖాన్‌తో కలిసి 'లాల్‌ సింగ్‌ చద్దా' చిత్రంలో నటిస్తోంది.

ఇది చూడండి : 'హీరోయిన్​ కాకపోతే అలా అవ్వాలనుకున్నా'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details