స్వీటీ అనుష్కకు టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ తెచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అరుంధతి'. ఈ సినిమాతో అనుష్క లేడీ సూపర్‌స్టార్‌గా అదరగొట్టేసింది. 2009లో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాన్ని... హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే సినిమా హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అనుష్క పాత్రలో కరీనా కపూర్‌ను తీసుకోవాలని చూస్తున్నారట.
బాలీవుడ్ జేజమ్మగా కరీనా కపూర్..! - అనుష్క
టాలీవుడ్ అగ్రకథానాయిక అనుష్కకు బాగా పేరుతెచ్చిన చిత్రం 'అరుంధతి'. ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ఓ నిర్మాణ సంస్థ సిద్ధమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో జేజమ్మ పాత్ర కోసం కరీనా కపూర్‌ను సంప్రదించినట్లు సమాచారం.
ప్రస్తుతం బాలీవుడ్‌లో సౌత్ సినిమాల రీమేక్‌లు ఘనవిజయం సాధిస్తున్న నేపథ్యంలో... ఇది త్వరలో పట్టాలెక్కుతుందని సినీ వర్గాల సమాచారం. ఇందులో జేజమ్మ పాత్రకు కరీనా కపూర్ తొలి ప్రాధాన్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకున్న కరీనా... ప్రస్తుతం సినిమాలు చేస్తూనే బుల్లితెరపైనా సందడి చేస్తోంది.
తొలుత ఈ సినిమాకు అనుష్కనే అనుకున్నప్పటికీ ఆమె.. బిజీగా ఉండటం వల్ల కరీనాను సంప్రదించారట. తెలుగులోకోడి రామకృష్ణ డైరక్షన్ చేశారు. హిందీలో దర్శకత్వం వహించేది ఎవరన్నది తెలియాల్సి ఉంది.