తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భయపెట్టేందుకు సిద్ధమైన కరణ్​ జోహార్​ - నిర్మాణం

బాలీవుడ్​ సినీ నిర్మాత, వ్యాఖ్యాత కరణ్​ జోహార్​ రూటు మార్చాడు. కొత్త జానర్​లో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. తన నేతృత్వంలోని ధర్మా ప్రొడక్షన్స్​ త్వరలో ఓ హారర్​ సినిమాను నిర్మించబోతోందంటూ ప్రకటించాడు. అప్పుడే విడుదల తేదీని వెల్లడించాడు.

కరణ్​ జోహార్​

By

Published : Jun 8, 2019, 10:29 AM IST

చాలా ఏళ్లుగా రొమాంటిక్​ సినిమాలనే రూపొందిస్తున్న బాలీవుడ్​ నిర్మాత కరణ్ ​జోహార్​ మనసు మారింది. హారర్​ సినిమాపై దృష్టి సారించాడు. త్వరలో ఆ జానర్​లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నానంటూ ప్రకటించాడు. తన నేతృత్వంలోని ధర్మా ప్రొడక్షన్స్​ భయపెట్టేందుకు సిద్ధమైందని చెప్పాడు. ఈ నెల 10వ తేదీన సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తానని ప్రకటించాడు. ఈ చిత్రాన్ని నవంబర్​ 15న విడుదల చేస్తామని చెప్పేశాడు.

కరణ్​ జోహార్​ ట్వీట్​

ధర్మా ప్రొడక్షన్స్​ తాజాగా నిర్మించిన స్టూడెంట్​ ఆఫ్​ ద ఇయర్-2 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. 2012లో విడుదలై బాలీవుడ్​ తెరకు ఆలియాభట్​, వరుణ్ ధావన్​, సిద్ధార్థ్​ మల్హోత్రాలను పరిచయం చేసిన స్టూడెంట్​ ఆఫ్​ ద ఇయర్​ చిత్రానికి సీక్వెల్​ అది.

నెట్​ ఫ్లిక్స్​ వేదికగా ప్రసారం కాబోయే 'వాట్ విత్​ లవ్​? విత్ కరణ్​ జోహార్​' అనే డేటింట్​ షోకు కూడా కరణ్​ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.

ఇదీ చూడండి : అమితాబ్, ఆయుష్మాన్ సినిమా వాయిదా

ABOUT THE AUTHOR

...view details