తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షారుఖ్ అభిమానులకు కరణ్ క్షమాపణలు - fans

షారుఖ్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న నిరసనలపై స్పందించాడు కరణ్. ట్విట్టర్ ఖాతాలో సాంకేతిక సమస్య తలెత్తిందని క్షమాపణ కోరాడు. కింగ్​ ఖాన్​కు వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్​కు కరణ్ లైక్ కొట్టాడు. దీనిపై ట్విట్టర్లో షారూక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరణ్ జోహార్

By

Published : Mar 22, 2019, 6:54 PM IST

షారుఖ్ ఖాన్​ అభిమానులను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ క్షమాపణలు కోరాడు. కింగ్​ఖాన్​కు వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్​కు కరణ్ లైక్ కొట్టిన నేపథ్యంలో దుమారం రేగింది. #షేమ్ ఆన్ కరణ్ అనే హ్యాష్ ట్యాగ్​తో షారుఖ్ ఫ్యాన్స్ బాలీవుడ్ దర్శకుడిపై ట్విట్టర్​లో నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన కరణ్.. తన ట్విట్టర్​ ఖాతాలో సాంకేతిక సమస్య తలెత్తిందని బదులిచ్చారు.

కరణ్ క్షమాపణ కోరిన ట్వీట్

అక్షయ్ కుమార్ నటించిన కేసరి చిత్రాన్ని షారుఖ్ జీరో సినిమాతో పోలుస్తూ చేసిన ట్వీట్​కు కరణ్ లైక్ కొట్టాడు. ఆగ్రహించిన కింగ్ ఖాన్ అభిమానులు కరణ్​కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

కరణ్​ జోహార్​ దర్శకత్వం వహించిన కుచ్ కుచ్​ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, కభీ అల్వీదా నా కహె​నా, మై నేమ్ ఈజ్ ఖాన్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో షారుఖ్ నటించాడు. కరణ్ చివరిగా దర్శకత్వం వహించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలోనూ బాలీవుడ్ బాద్​ షా అతిథి పాత్రలో మెరిశాడు.

కరణ్ లైక్ కొట్టిన ట్వీట్
కరణ్​పై మండిపడుతున్న షారుఖ్ అభిమాని

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details