తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బజార్‌ రౌడి' ట్రైలర్‌.. ఓటీటీలో దియా - దియా సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుంది?

సంపూర్ణేశ్‌ బాబు ప్రధాన పాత్రలో నటించిన 'బజార్‌ రౌడి' ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో సంపూ మాస్ లుక్​లో కనిపిస్తూ అలరిస్తున్నాడు. అలాగే కన్నడలో సూపర్​ హిట్​గా నిలిచిన 'దియా' చిత్రం ఓటీటీ వేదికగా తెలుగులో విడుదల కానుంది.

బజార్‌ రౌడి
బజార్‌ రౌడి

By

Published : Aug 17, 2021, 6:28 PM IST

'వచ్చాడు కాళి.. నాకెదురొచ్చినవాడు ఖాళీ' అంటూ యాక్షన్‌ షురూ చేశాడు సంపూర్ణేశ్‌ బాబు. కాళి పాత్రలో ఆయన నటించిన చిత్రం 'బజార్‌ రౌడి'. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. మహేశ్వరి వద్ది కథానాయిక. ఈ చిత్రం ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

'ఎనుబోతులని తినే రాబందు కూడా పక్షి జాతే' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరిస్తోంది. 'రౌడీలకు రామాయణం చెప్తే రావణాసురుడిని ఫాలో అవుతారు కానీ రాముడ్ని కాదు', 'నీకు బాంబే(ముంబయి)లో బ్యాక్‌గ్రౌండ్‌ ఉండొచ్చు. కానీ నాకు బాంబేనే బ్యాక్‌గ్రౌండ్‌', 'వచ్చాడు కాళి.. నాకెదురొచ్చిన వాడు ఖాళీ' వంటి పవర్‌ఫుల్‌ సంభాషణలు, కాలుతో సంపూర్ణేశ్‌ బైక్‌ని లేపే సన్నివేశం ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచాయి. అటు పోరాటాలు, ఇటు రొమాంటిక్‌ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్నాడు సంపూర్ణేశ్‌. ప్రచార చిత్రాన్ని బట్టి చూస్తుంటే సంపూర్ణేశ్‌ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో షాయాజీ షిండే, కత్తి మహేశ్‌, కరాటే కల్యాణి, షఫి, పృథ్వీరాజ్‌, నాగినీడు తదితరులు నటించారు. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి యస్‌.యస్‌. ఫ్యాక్టరి సంగీతం అందించారు. కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: ఎ.విజయ్‌కుమార్‌.

కన్నడ బ్లాక్‌ బస్టర్‌ 'దియా' తెలుగు రిలీజ్..

ఇటీవల కాలంలో ఇతర భాషల్లో విజయవంతమైన పలు చిత్రాలు తెలుగులో ఓటీటీ వేదికగా విడుదలవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో కన్నడ సూపర్‌హిట్ చిత్రం 'దియా' వచ్చి చేరింది. ఇప్పటికే ఓటీటీ వేదికగా కన్నడంలో ఈ సినిమా చూసిన సినీ అభిమానులు తెలుగులో ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురు చూస్తుండగా.. వారి ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయి.

పృథ్వీ అంబర్‌, దీక్షితా శెట్టి, ఖుషీ రవి కీలక పాత్రల్లో కె.ఎస్‌.అశోక్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ముక్కోణపు ప్రేమకథగా విడుదలైన ఈ చిత్రం కన్నడలో భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలోనే నేరుగా డిజిటల్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుండటం విశేషం.

ఆగస్టు 19న ఈ సినిమాను డిజిటల్‌ వేదికగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇటీవల తెలుగులో ప్రీరిలీజ్‌ వేడుకగా కూడా నిర్వహించారు. బి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.కృష్ణ చైతన్య నిర్మించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details