స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం. 'పుష్ప' అనే వినూత్న పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో అర్జున్ ఓ డిఫరెంట్ లుక్‌లో దర్శనమివ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ చూస్తే అది అర్థమవుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బన్నీ-సుకుమార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ! - Urvasi rautela in Pushpa
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బన్నీ
ఈ సినిమాలో కన్నడ హీరో దర్శన్ ఓ కీలకపాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. ఇతడు పోలీసు పాత్రలో కనిపిస్తాడని టాక్. అలాగే ఇందులోని ఐటమ్‌సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను సంప్రదించిందట చిత్రబృందం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.