కన్నడ చిత్రపరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. కేసు విచారణలో భాగంగా పలువురిని విచారిస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు.. బెంగళూరులోని హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంట్లో శుక్రవారం సోదాలు జరిపి, ఆమెను తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెను అరెస్టు చేశారు.
డ్రగ్స్ కేసులో నటి రాగిణి అరెస్ట్ - రాగిణి ద్వివేది
19:21 September 04
డ్రగ్స్ కేసులో నటి రాగిణి అరెస్ట్
"రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నాం. ఆమెతో పాటు రాహుల్, వివేక్ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం."
-బెంగళూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్)
గురువారం ఇదే కేసులో రవి శంకర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
గురువారం విచారణకు హాజరు కావాలని సీసీబీ అధికారులు నోటీసులు పంపారు. కానీ రాగిణి అక్కడికి వెళ్లలేదు. సదరు కారణాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ క్రమంలో అధికారులు ఆమె ఇంటిపై రైడ్ చేశారు.