గతేడాది 'మణికర్ణిక', 'మెంటల్ హై క్యా' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న కంగనా రనౌత్.. కొత్త ఏడాదిలో 'పంగా' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు ముస్తాబవుతోంది. 'బరేలీకి బర్ఫీ' ఫేం అశ్వనీ అయ్యర్ తివారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. జెస్సీ గిల్ కంగనాకు జోడీగా కనిపించనుండగా.. నీనా గుప్తా, రిచా చద్దా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది.
కంగనా కూతకు వస్తోంది.. కాచుకోండి - కంగనా రనౌత్ పంగా
కంగనా రనౌత్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తోన్న చిత్రం 'పంగా'. అశ్వినీ అయ్యర్ తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ 23న విడుదలకానుంది.
kangana
కబడ్డీ క్రీడ నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో కంగనా ఓ ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించబోతుంది. ఈ పాత్ర కోసం ఆమె బరువు పెరిగి, ఆటలోనూ ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ప్రస్తుతానికైతే ఈ మూవీ శాంపిల్‌గా ట్రైలర్‌ను చూపించేందుకు రంగం సిద్ధమైంది. దీన్ని డిసెంబరు 23న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను బయటకొదిలింది.
ఇవీ చూడండి.. నరాచి నుంచి రాఖీ భాయ్ వచ్చేశాడు..
Last Updated : Dec 22, 2019, 8:59 AM IST