తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్​ కంగనా రనౌత్​కు ట్విట్టర్​ షాక్​ - కంగనా రనౌత్ ట్విట్టర్​

స్టార్​ హీరోయిన్​ కంగనా రనౌత్​ ట్విట్టర్​ ఖాతా సస్పెన్షన్​కు గురైంది. ట్విట్టర్​ నిబంధనలకు వ్యతిరేకంగా కంగన ట్వీట్లు చేయడం వల్ల ఆమె ఖాతాను నిలిపేసినట్లు తెలుస్తోంది.

Kangana Ranaut's Twitter handle suspended for violating rules
కంగనా రనౌత్​

By

Published : May 4, 2021, 1:09 PM IST

Updated : May 5, 2021, 6:52 AM IST

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ట్విట్టర్​ ఖాతా సస్పెన్షన్​కు గురైంది. ట్విట్టర్​ నిబంధనలకు విరుద్ధంగా ట్వీట్​ చేసినందుకుగానూ ఆమె ఖాతాను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

"నా ఖాతాను తొలగించడం ద్వారా ట్విటర్‌ పుట్టుకతోనే అమెరికా అని మరోసారి రుజువు చేసింది. నల్లజాతివారిని శ్వేతజాతి ఎప్పుడూ బానిసలుగానే భావిస్తుంది. మనం ఏం ఆలోచించాలి.. మనం ఏం మాట్లాడాలో కూడా వాళ్లే నిర్ణయించాలనుకుంటారు. ఇదొక్కటే కాదు.. నా గొంతు వినిపించడానికి నాకు ఎన్నో మార్గాలున్నాయి. నా సినిమా కూడా అందులో భాగమే."

- కంగనా రనౌత్​, కథానాయిక

కంగనా రనౌత్​ ట్విట్టర్​ ఖాతా సస్పెన్షన్

పశ్చిమ బంగా​లో జరిగిన హింసాత్మక ఘటనలపై కంగన వరుస ట్వీట్లు​ చేసింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో తృణమూల్​ కాంగ్రెస్​ మరోమారు గెలుపొందగా.. ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి బంగాల్​లో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని ట్విట్టర్​ వేదికగా ఆమె డిమాండ్​ చేసింది. దీంతో సదరు డిజిటల్​ ఫ్లాట్​ఫామ్​ నిబంధనలకు వ్యతిరేకంగా సందేశాలు పంపడం వల్ల కంగన ఖాతా ట్విట్టర్​ నిలిపేసింది.

ఇదీ చూడండి:సినీ కార్మికుల కోసం నిర్మాణసంస్థ చొరవ

Last Updated : May 5, 2021, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details