నటుడు సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నెపొటిజమ్ అంశం తీవ్రంగా చర్చనీయాంశమైంది. సినీవారసుల సోషల్ మీడియా ఖాతాలను నెటిజన్లు అన్‌ఫాలో చేస్తున్నారు. కానీ ఇప్పుడు బంధుప్రీతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తోన్న కంగనా రనౌత్కూ ఈ బాధ తప్పట్లేదు. కంగన ట్విట్టర్లో ఓ రోజుకి దాదాపు 40-50వేల ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ విషయమై మాట్లాడింది కంగన. నెటిజన్లు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పింది.
"రోజూ ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోవడం నేను గమనించా. ఈ ప్లాట్‌ఫాం నాకు కొత్త. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియట్లేదు. జాతీయవాదులు ప్రతి చోట కష్టపడాల్సి వస్తుంది. రాకెట్ చాలా బలంగా ఉంది. అన్‌ఫాలో చేసిన వారికి హృదయపూర్వక క్షమాపణలు."