జేఎన్యూలో అల్లర్లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన వైఖరితో వ్యవహరించాలని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కోరింది. కళాశాలల్లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న విషయాన్ని జాతీయ అంశంగా పరిగణించాల్సిన అవసరం లేదంది. 'పంగా' సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. పై వ్యాఖ్యలు చేసింది.
జేఎన్యూ ఘటనపై స్పందించిన కంగనా రనౌత్ - kangana ranaut on jnu violence
సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ కంగనా రనౌత్.. జేఎన్యూ ఘటన గురించి మాట్లాడింది. పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరింది.
హీరోయిన్ కంగనా రనౌత్
సినిమాలో తల్లి పాత్ర పోషించడం గొప్పగా ఉందని చెప్పింది. సమాజంలో ఓ మహిళ.. తల్లిగా మారిన తర్వాత ఆమె కష్టాలు, అభిరుచులు చంపుకుంటోందంది. కుటుంబ సభ్యుల సహకారముంటే, మహిళలు తల్లయ్యాక కూడా ఏదైనా సాధించగలరనే చెప్పే కథే 'పంగా' అని వివరించింది.
ఈ చిత్రంలో కంగనా.. కబడ్డీ క్రీడాకారిణి, గృహిణి పాత్రల్లో కనిపించనుంది. అశ్విని దర్శకత్వం వహించారు. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated : Jan 10, 2020, 4:52 PM IST