తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొవిడ్ దెబ్బకు కంగన 'తలైవి' వాయిదా - కంగన తలైవి న్యూస్

కరోనా ప్రభావం మరో సినిమాపై పడింది. కంగన 'తలైవి' విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Kangana Ranaut starrer 'Thalaivi' postponed amidst rise in COVID-19 cases
కొవిడ్ దెబ్బకు కంగన 'తలైవి' వాయిదా

By

Published : Apr 9, 2021, 8:48 PM IST

కొవిడ్ దెబ్బ ప్రాంతీయ చిత్రాలకే కాదు పాన్ ఇండియా సినిమాలకు తగులుతోంది. కంగనా రనౌత్​ నటించిన 'తలైవి' విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాతలు శుక్రవారం ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలో కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటిస్తామని అన్నారు.

'తలైవి' విడుదల వాయిదా ప్రకటన

ముందు చెప్పిన ప్రకారం ఏప్రిల్ 23న 'తలైవి' థియేటర్లలోకి రావాలి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కంగన టైటిల్​ రోల్​ చేయగా, ప్రకాశ్ రాజ్, అరవింద స్వామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు.

ఇది చదవండి:'లవ్​స్టోరి' వాయిదా.. కరోనానే కారణం

ABOUT THE AUTHOR

...view details