బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీతో భేటీ అయ్యింది. రనౌత్‌తో పాటు ఆమె సోదరి రంగోలీ కూడా గవర్నర్‌ను కలిసేందుకు వచ్చింది. ఈ సమావేశంలో శివసేన పార్టీ తనకు చేసిన అన్యాయం గురించి గవర్నర్‌కు విన్నవించుకుంది కంగన. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన హీరోయిన్.. "నేను ఒక పౌరురాలిగా ఆయనను కలిసేందుకు వెళ్లా. నన్ను ఒక కుమార్తెలా భావించి నా సమస్యను విన్నారు. రాజకీయాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు." అని పేర్కొంది.
మహారాష్ట్ర గవర్నర్‌తో నటి కంగన భేటీ - kangana ranout
బాలీవుడ్ నటి కంగనా రనౌత్, శివసేన పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సమావేశమైంది కంగన.
కంగన
ఇటీవలే బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ మృతి తర్వాత హిందీ చిత్రసీమలోని పెద్దలపై కంగన విరుచుకుపడింది. ఈ క్రమంలోనే ఆమె ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. దీంతో శివసేన పార్టీ, కంగన మధ్య మాటల యుద్ధానికి తెరలేసింది. ఇదే సమయంలో ముంబయిలోని కంగన కార్యాలయం అక్రమ కట్టడమని పేర్కొంటూ, బీఎంసీ అధికారులు కూల్చివేత ప్రారంభించగా.. ఆ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది.
Last Updated : Sep 13, 2020, 6:00 PM IST