బాలీవుడ్ ముద్దుగుమ్మలు తాప్సీ(Taapsee), కంగనా రనౌత్(Kangana Ranaut)ల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా ఉంది. వాళ్లిద్దరి మధ్య ఎంతోకాలం నుంచి జరుగుతున్న కోల్డ్‌వార్ కంట్రోలయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలుమార్లు సోషల్‌మీడియా వేదికగా మాటల యుద్ధం చేసిన ఈ భామలు చాలారోజుల తర్వాత మరోసారి వాగ్వాదానికి తెర తీశారు.
ఇటీవల కొన్నిరోజులపాటు రష్యా టూర్‌కు వెళ్లి వచ్చిన తాప్సీ ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'హసీనా దిల్‌రుబా' ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటోంది. ప్రమోషన్‌లో భాగంగా.. 'కంగనకు(Kangana Taapsee) తన జీవితంలో ఎలాంటి ప్రాధాన్యం లేదు' అని తాప్సీ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ స్పందించింది.
"నేను వదిలేసిన ప్రాజెక్టుల్లో తనకు అవకాశం కల్పించమని.. తాప్సీ ఎంతో మంది నిర్మాతలను బతిమిలాడుకుని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. చిన్నస్థాయి నిర్మాతలకు కంగనా రనౌత్‌లా మారినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని తాప్సీ ఒకానొక సమయంలో చెప్పింది. కానీ ఇప్పుడు, తన జీవితంలో నాకు ఎలాంటి ప్రాధాన్యం లేదు అంటోంది. మనుషుల కుళ్లు స్వభావానికి ఇదో నిదర్శనం. ఏది ఏమైనా తాప్సీ.. నీ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అలాగే, నా పేరు లేకుండా నీ సినిమా ప్రమోట్ చేసుకో."