తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రెస్‌మీట్‌లో అలాంటి ప్రశ్న.. విలేకరిపై కంగన ఫైర్‌ - kangana ranaut fight

Kangana Ranuat: బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ దీపికా పదుకొణెపై అడిగిన ఓ ప్రశ్నకు రిపోర్టర్​పై ఫైర్​ అయ్యారు నటి కంగనా రనౌత్. ఇంతకీ ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే?

Kangana Ranaut
కంగనా రనౌత్

By

Published : Feb 4, 2022, 11:43 AM IST

Kangana Ranuat: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఓ విలేకరిపై ఫైర్‌ అయ్యారు. రియాల్టీ షో ప్రెస్‌మీట్‌లో అందరి ముందు.. 'ఇక కూర్చొ' అంటూ విలేకరిని ఉద్దేశించి అన్నారు. ఇంతకీ ఆమె అంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేమిటంటే.. కంగనారనౌత్‌ వ్యాఖ్యాతగా పరిచయం కానున్న రియాల్టీ షో 'లాక్‌ అప్‌'. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌ నిర్మించనున్న ఈ రియాల్టీ షో మరికొన్ని రోజుల్లో ఏఎల్‌టీ బాలాజీ, ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వేదికగా అందుబాటులో ఉండనుంది. కాగా, ఈ షో ఫార్మాట్‌ను తెలియజేస్తూ గురువారం సాయంత్రం విలేకర్ల సమావేశం నిర్వహించారు.

కంగనా రనౌత్

కాగా, ఇందులో పాల్గొన్న కంగనా.. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. "ఏక్తాకపూర్‌ క్రియేట్‌ చేసిన కాన్సెప్ట్‌ నాకెంతో నచ్చింది. అందుకే షో చేసేందుకు ఓకే చెప్పా" అని కంగన చెప్పగానే.. మరో విలేకరి మాట్లాడుతూ.. "మేడమ్‌ ఈ మధ్య కాలంలో మహిళ ధరించిన దుస్తులు ఆధారంగా ఎదుటివాళ్లు ఆమె ప్రవర్తనపై కామెంట్‌ చేస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె సైతం ఈవిధంగా నెగటివిటీ ఎదుర్కొన్నారు. 'గెహ్రాహియా' ప్రమోషన్స్‌లో ఆమె ధరించిన దుస్తులపై విపరీతంగా కామెంట్లు వచ్చాయి. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు" అని అడగ్గా.. "చూడండి, తమను తాము రక్షించుకోలేని వారి గురించి నేను మాట్లాడగలను. కానీ, ఆమె (దీపికాపదుకొణె) తనను తాను రక్షించుకోగలదు. ఆమెకు ఆ అధికారం ఉంది. ముఖ్యంగా, ఆమె సినిమాను ఈ ప్లాట్‌ఫామ్‌పై ప్రమోట్‌ చేయను. కాబట్టి, మీరు కూర్చొండి" అని కంగన అసహనం వ్యక్తం చేశారు.

కంగనా

ఇదీ చూడండి:దేశంలోనే బిగ్గెస్ట్​​ రియాలిటీ షో... హోస్ట్​గా కంగనా రనౌత్​!

ABOUT THE AUTHOR

...view details