తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నీ కెరీర్​లో 'క్వీన్'​ సినిమా తప్ప మరో హిట్​ లేదు' - మినీ మహేశ్​ భట్​ అనురాగ్​ కశ్యప్​

ప్రముఖ నటి కంగనా రనౌత్​​, దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ మధ్య కొన్నిరోజులుగా సోషల్​మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో అనురాగ్​ను 'మినీ మహేశ్​ భట్'​ అని సంభోదిస్తూ.. ట్వీట్​ చేసింది కంగనా.

Kangana Ranaut claps back at Anurag Kashyap, calls him 'mini Mahesh Bhatt'
'నీ కెరీర్​లో 'క్వీన్'​ సినిమా తప్ప మరో హిట్​ లేదు'

By

Published : Jul 22, 2020, 2:00 PM IST

హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ బలన్మరణం తర్వాత బాలీవుడ్​లో వివాదాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బంధుప్రీతిపై కీలక వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్​.. తాాజాగా దర్శకుడు అనురాగ్​ కశ్యప్​పైనా విమర్శలు గుప్పించింది. అనురాగ్​ను "మినీ మహేశ్​ భట్"​ అని సంభోధిస్తూ ట్విట్టర్​లో ఓ పోస్ట్​ పెట్టింది​. అతని కెరీర్​లో తను నటించిన 'క్వీన్'​ సినిమానే పెద్ద హిట్​గా నిలిచిందని పేర్కొంది.

గతంలో తనకూ పెద్ద నిర్మాతల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని అనురాగ్​ కశ్యప్​ వెల్లడించారు. అలాంటి సమయంలోనూ కంగనాకు సహాయం చేశానన్నారు.

"బాలీవుడ్​ నాకు తిండి తెచ్చిపెట్టలేదు. ధర్మ, ఎక్సైల్​ లేదా యాశ్​రాజ్​ ఫిల్మ్స్​ వంటి సంస్థలు నా సినిమాలను నిర్మించడానికి ముందుకు రాలేదు. చివరికి నేను నా స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను సృష్టించాను. కంగనాకు అవకాశాలు లేనప్పుడు క్వీన్​ చిత్రాన్ని తెరకెక్కించాం. 'తను వెడ్స్​ మను' సినిమా కోసం దర్శకుడు ఆనంద రాయ్​ని ఫైనాన్సర్ల వద్దకు తీసుకెళ్లి నేను సినిమా పూర్తి చేయడంలో సాయం చేశాను. కావాలంటే మీరు ఒకసారి అతడ్ని అడగవచ్చు."

-అనురాగ్​ కశ్యప్​, బాలీవుడ్​ దర్శకనిర్మాత

దీనికి కంగనా రనౌత్ టీమ్​ స్పందిస్తూ.. "అవును ఇది నిజం. మరొక నిజం ఏమిటంటే మీ కెరీర్​లో 'క్వీన్​' సినిమా మాత్రమే ఏకైక విజయంగా ఉంది. ఫాంటమ్​ యూ 4 పార్ట్​నర్స్ అనే ప్రొడక్షన్​​ హౌస్​ నుంచి ఆ చిత్రం విడుదలైంది. కనీసం ఆమెకున్న కృతజ్ఞతా భావమైనా మీలో ఉండాలి" అని పోస్ట్​ చేశారు.

కంగనా రనౌత్​ ప్రధానపాత్రలో నటించిన 'క్వీన్'​ చిత్రం 2013లో వయాకామ్​ 18 మోషన్​ పిక్చర్స్​తో పాటు ఫాంటమ్​ ఫిల్మ్స్​ సంస్థలు విడుదల చేశాయి. అనురాగ్​ కశ్యప్​, విక్రమాదిత్య మోత్వానే, మధు మంతేనా, వికాస్​ బహల్​లు కలిసి ఈ చలన చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థలను ప్రారంభించారు.

మణికర్ణికపైనా ట్వీట్​...

గతేడాది కంగనకు సంబంధించిన ఓ వీడియోను అనురాగ్​ షేర్​ చేశారు. 'మణికర్ణిక' ప్రాజెక్టులో కొంత భాగానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టినట్లు చెప్పుకొని.. సినిమా క్రెడిట్ మొత్తం ఆమె ఖాతాలో వేసుకుందని అనురాగ్​ విమర్శించారు.

"నిన్న కంగనా ఇంటర్వ్యూ చూశారు. ఆమె ఒక సమయంలో నాకు చాలా మంచి స్నేహితురాలిగా ఉండేది. ప్రస్తుతం కొత్తగా మాట్లాడుతున్న కంగనా గురించి నాకు తెలియదు. ఇప్పడే ఆమె భయానక ఇంటర్వ్యూ చూశాను. 'మణికర్ణిక' చిత్రం విడుదలైన తర్వాత మాట్లాడిన సందర్భంలో తీసినది. కంగనా టీమ్​ మీకు ఈ వీడియో సరిపోతుంది. దీన్ని చూసిన తర్వాత నాపై మీరు ఎలా స్పందిస్తారో నేను పట్టించుకోను" అని అనురాగ్​ కశ్యప్​ ట్వీట్​ చేశాడు.

దీనిపై స్పందించిన కంగనా టీమ్​.. అనురాగ్​ను 'మినీ మహేశ్​ భట్' అని సంభోధించింది. "కంగనా ఒంటరిగా ఉందని.. ఆమె చుట్టూ నకిలీ వ్యక్తులు ఉన్నారని మినీ మహేశ్​ భట్​ అంటున్నాడు. దేశ వ్యతిరేకులు, నక్సల్స్, ఉగ్రవాదులను రక్షించే విధంగా సినీమాఫియాను రక్షించుకుంటున్నారు. ఇలాంటి వారే సుశాంత్​ను మానసికం వేధించి అతన్ని హతమార్చారు" అని కంగనా రనౌత్​ టీమ్ కౌంటర్​​ ట్వీట్​ చేసింది.

ABOUT THE AUTHOR

...view details