తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కాలక్షేపం కోసం.. కప్​కేకుతో కుస్తీ, కుక్కపిల్లతో దోస్తీ - కంగనా రనౌత్​

కరోనా విరామాన్ని అభిరుచికి తగ్గట్టు సద్వినియోగం చేసుకుంటున్నారు కథానాయికలు. ఇంటిపట్టున ఉంటూ.. నచ్చిన పని చేస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. మరి ఎవరెవరు లాక్​డౌన్​ సమయంలో ఏం చేస్తున్నారో చూసేద్దామా?

kanagana ranaut, keerthi suresh alia bhatt spending at home in lockdown period
కప్‌కేకులతో కుస్తీ.. కుక్కపిల్లతో దోస్తీ

By

Published : Apr 14, 2020, 6:38 AM IST

సినిమాలే ప్రపంచంగా బతికేస్తూ తమకు ఇష్టమైన చాలా విషయాలకు సమయం కేటాయించలేని వాళ్లు ఇప్పుడు లాక్​డౌన్​ కారణంగా రంగంలోకి దిగారు. వంట గదిని ప్రయోగశాలగా చేసేసి కొత్త వంటకాలను కొందరు సిద్ధం చేస్తుంటే.. మరికొందరు పాత జ్ఞాపకాలతోనూ, పెంపుడు జంతువులతోనూ కాలక్షేపం చేస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ కుటుంబంతో గడుపుతూనే తనకు ఇష్టమైన కప్‌ కేకుల తయారీలో నిమగ్నమైంది. కంగన సోదరి రంగోలి కంగనా చిన్ననాటి ఫొటోను పంచుకుంది. స్కూల్‌ రోజుల్లో వేసిన రామాయణ నాటకానికి సంబంధించిన ఫొటో అది. అందులో సీత వేషం వేసిన చిన్నారి కంగన.. ఎర్ర చీరలో ఆకట్టుకుంటోంది.

కప్‌కేకులతో కుస్తీ..
పాత జ్ఞాపకాల్లో.. అక్కా చెల్లెల్లు..

మరో నాయిక ఆలియాభట్‌ కూడా వంటలు చేయడంలో బిజీగా ఉంది. ఆమె తన సోదరి షహీన్‌తో ముంబయిలో ఉంటుంది. సోదరి కోసం ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నప్పుడు తీసిన ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

కప్‌కేకులతో కుస్తీ.. కుక్కపిల్లతో దోస్తీ

ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్‌ ఇంటి మేడపై నుంచి సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూనే.. తన పెంపుడు కుక్క పిల్లతో ఆడుకుంటోంది. లౌక్‌డౌన్‌ సమయంలో నాయికలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఈ ఫొటోలు అభిమానులను అలరిస్తున్నాయి.

కుక్కపిల్లతో దోస్తీ

ఇదీ చదవండి: నేడే మోదీ ప్రసంగం.. లాక్​డౌన్​పై స్పష్టతకు అవకాశం

ABOUT THE AUTHOR

...view details