తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒంటరిగా తమన్నా... పక్కనే సైకో కిల్లర్... - tamanna

తమన్నా, ప్రభుదేవా జంటగా నటించిన 'ఖామోషీ' టీజర్ విడుదలైంది. చెవిటి యువతిగా తమన్నా, సైకో కిల్లర్​గా ప్రభుదేవా కనిపించనున్నాడు.

తమన్నా

By

Published : May 10, 2019, 9:51 PM IST

ఊరికి దూరంగా విసిరేసినట్లు ఓ పెద్ద బంగ్లా. అందులో ఒంటరిగా తిరుగుతున్న ఓ యువతి. ఆమెకు వినిపించదు. ఓ సైకో కిల్లర్‌ ఆమెను హత్య చేయడానికి ఆ బంగ్లాలోకి ప్రవేశిస్తాడు. ఇద్దరి మధ్య ఓ భయంకర నిశ్శబ్దం. ప్రాణం తీయాలని ఒకరు.. తప్పించుకోవాలని మరొకరు.. మరి ఆ సైకో కిల్లర్ తన పంతాన్ని నెగ్గించుకున్నాడా? ఆ యువతి ప్రాణాలు కాపాడుకుందా? తెలియాలంటే ‘ఖామోషీ’ వచ్చే వరకు ఆగాల్సిందే.

ప్రభుదేవా - తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. ‘ఈనాడు’, ‘డేవిడ్‌ బిల్లా’ వంటి వైవిధ్యభరిత సినిమాలు తెరకెక్కించిన చక్రి తోలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఓ సరికొత్త హర్రర్​ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో తమన్నా చెవిటి యువతిగా కనిపించనుంది. సైకో కిల్లర్‌ పాత్రను ప్రభుదేవా పోషిస్తున్నాడు. భూమిక మరో కీలక పాత్ర పోషించింది.

ABOUT THE AUTHOR

...view details