తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జనవరిలో 'భారతీయుడు-2' షూటింగ్! - దర్శకుడు శంకర్

వచ్చే ఏడాది జనవరి చివర్లో గానీ, ఫిబ్రవరి ఆరంభంలో గానీ కమల్​ హాసన్​.. భారతీయుడు 2 షూటింగ్​లో పాల్గొంటారని కోలీవుడ్​ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్​ త్వరితగతిన పూర్తి చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Kamal Hassan
జనవరిలో 'భారతీయుడు2' షూటింగ్ షురూ

By

Published : Dec 11, 2020, 9:02 AM IST

లంచగొండులకు ముచ్చెమటలు పట్టించే దేశభక్తుడిగా కమల్ హాసన్​ నటించిన భారతీయుడు సినిమా అప్పట్లో ఓ సంచలనం. దాదాపు 24 ఏళ్ల తర్వాత హీరో కమల్, దర్శకుడు శంకర్ ఆ సినిమాకు సీక్వెల్​ను ప్రకటించారు. అప్పటినుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. సినిమా షూటింగ్ గతేడాది మొదలుపెట్టారు.

దురదృష్టవశాత్తు ఫ్రిబ్రవరిలో చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో అప్పటినుంచే షూటింగ్​ ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా, లాక్​డౌన్​లతో చిత్రీకరణ జరగలేదు. ఇంతలో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు అభిమానులకు ఊరటనిచ్చే ఓ వార్త చెన్నైలో చక్కర్లు కొడుతోంది. భారతీయుడు2 చిత్రీకరణ పునఃప్రారంభం అవుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది జనవరి చివర్లో కానీ, ఫిబ్రవరి ఆరంభంలో కానీ కమల్​ షూటింగ్​లో పాల్గొంటారని సమాచారం.

నెల రోజుల్లో సినిమా అంతా పూర్తి చేసి ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఆయన ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్​ దర్శకత్వంలో విక్రమ్ సినిమా పనుల్లోనూ కమల్ బిజీగా ఉన్నారు. ఇందులో విలన్ పాత్ర కోసం ఫాహద్ ఫాజిల్​ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:కష్టసమయాల్లోనూ కథానాయికల 'డబుల్ ధమాకా'

ABOUT THE AUTHOR

...view details