Kamal Haasan news: దిగ్గజ నటుడు కమల్‌హాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. డిసెంబర్ 3 వరకు ఐసోలేషన్‌లోనే ఉండనున్నట్లు స్పష్టం చేసింది. 4 నుంచి కమల్ తన రోజూవారీ పనులు చేసుకోవచ్చని పేర్కొంది.
నవంబరు 22న కమల్ హాసన్‌కు కరోనా సోకింది. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న తర్వాత పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని కమల్ ట్వీట్లో తెలిపారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.