తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"కళంక్" టీజర్ వచ్చేసిందోచ్...

బాలీవుడ్ అగ్రతారలు నటిస్తున్న "కళంక్" టీజర్ విడుదలైంది. స్వాతంత్య్రం రాక ముందు జరిగిన ఓ యదార్థ కథతో సినిమా తెరకెక్కింది.

By

Published : Mar 12, 2019, 3:17 PM IST

నెట్టింట్లో సందడి చేేస్తున్న కళంక్ టీజర్

కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా "కళంక్". సినిమా టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. బాలీవుడ్ తారలు సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, అలియా భట్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. "టూ స్టేట్స్" సినిమాతో ఆకట్టుకున్న అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మధ్య చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్​లు అభిమానులను ఆకట్టుకున్నాయి. కరణ్ జోహార్,సాజిద్ నడియావాలా, యాశ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రీతమ్ సంగీతమందించారు. అతిథి పాత్రల్లో కియరా అడ్వాణీ, కృతి సనన్ కనిపించనున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 17న విడుదల కానుంది ఈ భారీ బడ్జెట్ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details