పెళ్లయిన తర్వాత మంగళవారం తాను నటిస్తోన్న 'ఆచార్య' సినిమా సెట్లో అడుగుపెట్టింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి షూటింగ్ స్పాట్లో సందడి చేసింది. ఈ సందర్భంగా నవ వధూవరులను సర్ప్రైజ్ చేసింది 'ఆచార్య' చిత్రబృందం. వారి చేత దండలు మార్పించి కేక్ కట్ చేయించింది.
'ఆచార్య' సెట్లో కాజల్-కిచ్లూ జంటకు మెగాశీస్సులు
షూటింగ్ సెట్లో నవ వధూవరులు హీరోయిన్ కాజల్-గౌతమ్ కిచ్లూ చేత కేక్ కట్ చేయించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది 'ఆచార్య' చిత్రబృందం. ఈ కొత్త జంటను మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వదించారు.
కాజల్
కాజల్-కిచ్లూకు చిరు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు. ఈ సెలబ్రేషన్లో చిరుతో పాటు దర్శకుడు కొరటాల శివ, సినిమాటోగ్రాఫర్ తిరు, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్, సహ నిర్మాత అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : అలా చేస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పా: కాజల్