రోజూ చేసే సూర్య నమస్కారాలే తన ఫిట్‌నెస్ రహస్యమని చెబుతోంది అందాల నటి కాజల్ అగర్వాల్. వారంలో మూడు రోజులు యోగా చేసే అలవాటు తనను ఒత్తిడి నుంచి దూరం చేస్తుందని అంటోంది.
"రోజూ చేసే అరగంట వ్యాయామం వల్ల కండరాలన్నీ పనిచేసి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ పాటించొచ్చు. శరీరంలోని అవయవాలన్నింటి కోసం ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఎంపిక చేసి వర్కవుట్స్ చేస్తే నిండైన ఆరోగ్యం సొంతమవుతుంది. నేనూ ఇవే పాటిస్తా. వారానికి ఒకసారి 45 నిమిషాలు గుండెకు సంబంధించి, ఓ గంట ఎముకలు పటిష్టంగా ఉండటానికి ఎక్సర్ సైజులు తప్పనిసరి."
- కాజల్ అగర్వాల్, కథానాయిక
ఫిట్‌నెస్ పేరుతో శరీరాన్ని ఎక్కువగా ఒత్తిడికి గురిచేసే అలవాటు తనకు లేదని కాజల్ వెల్లడించింది. "సాధారణంగా కొవ్వు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాలైన చేతులు, పొత్తికడుపు, ఛాతీ, నడుముకు సంబంధించిన వ్యాయామాలకు ప్రాధాన్యమినిస్తా. ఫిట్‌నెస్ పేరుతో శరీరాన్ని ఎక్కువగా ఒత్తిడికి గురిచేసే అలవాటు నాకు లేదు. రోజూ కనీసం గంటసేపు ఈతకొట్టే అలవాటు నా శరీరసౌష్టవాన్ని కాపాడుతోంది. అదనపు కెలోరీలను కరిగించడం కోసం డ్యాన్స్ అలవాటు చేసుకున్నా. వీటితోపాటు ఏడు గంటల నిద్ర నన్ను తెల్లవారేసరికి తాజాగా ఉంచుతుంది" అని ఆమె చెబుతోంది.
ఇదీ చూడండి..అందాల నిధి.. దోచేస్తోంది మది!