టాలీవుడ్లో హీరోలను ఆరాధించే పద్ధతి తనకు నచ్చలేదని చెబుతోంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. పలువురు అగ్రకథానాయకుల సరసన నటించిన ఈ భామ.. ఇటీవలే ఓ ప్రముఖ టాక్ షోలో పాల్గొంది. అందులో మాట్లాడుతూ ఉత్తరాది, దక్షిణాది చిత్రసీమలకు మధ్య ఉన్న మంచి, చెడులేంటో తన అనుభవాల నుంచి చెప్పుకొచ్చింది.
"తెలుగు చిత్ర పరిశ్రమలో సమయపాలన, క్రమశిక్షణ చాలా గొప్పగా ఉంటాయి. ఉదయం 6 గంటలకు సెట్స్‌లోకి అడుగుపెడితే ఏడింటికే చిత్రీకరణ మొదలైపోతుంది. సాయంత్రం 6 గంటల కల్లా ప్యాకప్ చెప్పెయ్యొచ్చు. కానీ బాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితి కనిపించదు. అక్కడ మధ్యాహ్నం 12కు గానీ చిత్రీకరణ మొదలు కాదు. పూర్తయ్యే సరికి రాత్రి 12 దాటిపోతుంది. అందుకే ఇక్కడ పనిచేసి హిందీలో చేస్తుంటే ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది" -కాజల్ అగర్వాల్, హీరోయిన్