తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఖైదీ'తో తొలిసారి రూ.100 కోట్ల మార్క్! - 'ఖైదీ' కలెక్షన్లు

కోలీవుడ్​ హీరో కార్తీ.. 'ఖైదీ'తో తన కెరీర్​లో తొలిసారిగా రూ.100 కోట్ల గ్రాస్ సాధించాడు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందీ చిత్రం.

ఖైదీ సినిమా హీరో కార్తీ

By

Published : Nov 12, 2019, 2:52 PM IST

హీరో కార్తీ.. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇటీవలే 'ఖైదీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఖైదీ సినిమా హీరో కార్తీ

'ఖైదీ'.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.100 కోట్లు గ్రాస్​ సాధించిందని సమాచారం. పాటలు, రొమాన్స్, హీరోయిన్​, కామెడీ ట్రాక్స్ తదితర అంశాలు లేకుండా ఈ మార్క్​ను అందుకున్న చిత్రం బహుశా ఇదేనేమో. కార్తీ హీరోగా నటించిన వాటిలో వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన తొలి సినిమా ఇదే.

ఈ విజయంతో కార్తీ.. తర్వాత చిత్రాలకు డిమాండ్​ పెరిగింది. అదే విధంగా దర్శకుడు లోకేశ్ కనకరాజ్​కు స్టార్ హీరో కమల్​హాసన్​ నుంచి పిలుపొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డైరక్టర్ విజయ్​తో సినిమా చేస్తున్నాడు.

ఇది చదవండి: పవన్​కల్యాణ్ హిట్​ టైటిల్​పై కార్తీ కన్ను!

ABOUT THE AUTHOR

...view details