తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నెట్టింట 'కబీర్ సింగ్' సందడి షురూ - అర్జున్ రెడ్డి

అభిమానుల్ని ఆకట్టుకునేందుకు షాహిద్ కపూర్ సిద్ధమయ్యాడు. కొత్త సినిమా 'కబీర్ సింగ్'​ ట్రైలర్​తో నెట్టింట సందడి చేస్తున్నాడు.

నెట్టింట 'కబీర్ సింగ్' సందడి షురూ..

By

Published : May 13, 2019, 2:29 PM IST

టాలీవుడ్​లో 'అర్జున్ రెడ్డి' సృష్టించిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో విజయ్ దేవరకొండ కెరీర్​లో బిగ్గెస్ట్ హిట్​గా నిలిచిందీ సినిమా. బాలీవుడ్ షాహిద్ కపూర్​ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని 'కబీర్​ సింగ్​'గా రీమేక్​ చేశారు. కియారా అడ్వాణీ హీరోయిన్​. సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది.

ప్రియురాలిని మరిచిపోలేక మద్యానికి బానిసైన ఓ డాక్టర్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథాంశం. మాతృకను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. ఎక్కువ శాతం ఒరిజినల్​ సినిమాలానే ఉందనే విషయం ఈ ప్రచార చిత్రం చూస్తే స్పష్టమవుతోంది. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇది చదవండి: టాలీవుడ్​లో 'అర్జున్ రెడ్డి' కాంబినేషన్ మరోసారి..!

ABOUT THE AUTHOR

...view details