తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇక్కడ సమస్య కులం.. అక్కడ పొగతాగడం

షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ జంటగా నటించిన కబీర్ సింగ్.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో కొత్త ట్రెండ్​ సృష్టించిన అర్జున్​ రెడ్డి చిత్రం స్క్రిప్ట్​లో స్వల్ప మార్పులు చేసి ఈ రీమేక్​ను రూపొందించినట్లు సమాచారం.

ఇక్కడ సమస్య కులం.. అక్కడ పొగతాగడం

By

Published : Jun 20, 2019, 6:45 AM IST

తెలుగులో బ్లాక్​బస్టర్ అయిన 'అర్జున్ రెడ్డి'ని బాలీవుడ్​లో 'కబీర్ సింగ్'​ పేరుతో తెరకెక్కించారు. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కబీర్​ సింగ్​ మాతృక అర్జున్​ రెడ్డి స్క్రిప్ట్​కుస్వల్ప మార్పులు చేసి ఈ సినిమాను రూపొందించారు. హిందీలోనూ 'అర్జున్ రెడ్డి' టైటిల్​ పెట్టాలనుకున్నారు. కానీ తర్వాత కబీర్ సింగ్​గా పేరు మార్చారు. తెలుగు చిత్రంలో కులం కారణంతో హీరో ప్రేమను కథానాయిక తండ్రి తిరస్కరిస్తాడు. హిందీలో పొగ తాగే అలవాటు నచ్చక కథానాయకుడు ప్రేమను తిరస్కరించేలా స్క్రిప్ట్​లో మార్పులు చేశారు.

మాతృకను తెరకెక్కించినా సందీప్ రెడ్డి వంగా.. కబీర్ సింగ్​కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మొదట హీరోగా రణ్​వీర్​ సింగ్, అర్జున్ కపూర్​లను పరిశీలించినా చివరికి ఆ అవకాశం షాహిద్ కపూర్​నే వరించింది.

ఇది చదవండి: 200 కోట్ల క్లబ్​లో సల్మాన్​ఖాన్​ 'భారత్​'

ABOUT THE AUTHOR

...view details