తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాక్సాఫీస్​ బరిలో కబీర్ సింగ్ దూకుడు - విజయ్ దేవరకొండ

శుక్రవారం విడుదలైన 'కబీర్ సింగ్' తొలి రోజు రూ.20.21 కోట్ల వసూళ్లు సాధించింది. అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన హిందీ సినిమాల్లో నాలుగో స్థానంలో నిలిచింది.

భాక్సాఫీస్​ బరిలో కబీర్ సింగ్ దూకుడు

By

Published : Jun 23, 2019, 6:14 AM IST

ఇటీవలే బాలీవుడ్​లో విడుదలైన చిత్రం 'కబీర్ సింగ్'. ప్రస్తుతం బాక్సాఫీస్​ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. జంటగా నటించిన షాహిద్ కపూర్- కియారా అడ్వాణీ ప్రేక్షుకల్ని ఆకట్టుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. తెలుగు బ్లాక్​బస్టర్ 'అర్జున్ రెడ్డి'కి ఇది రీమేక్.

ఈ సినిమాకు తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.20.21 కోట్ల వసూళ్లు దక్కినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన బాలీవుడ్‌ సినిమాల జాబితాలో ‘కబీర్‌ సింగ్‌’ నాలుగో స్థానం సొంతం చేసుకున్నట్లు చెప్పారు. అతడి కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.

‘భారత్‌’ రూ.42.30 కోట్లు, ‘కలంక్‌’ రూ.21.60 కోట్లు, ‘కేసరి’ రూ.21.06 కోట్లు రాబట్టి ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. రూ.19.40 కోట్ల కలెక్షన్స్‌తో ‘గల్లీబాయ్‌’ ఐదో స్థానంలో ఉంది.

ఇది చదవండి: 'ముద్దు సన్నివేశాల్లో నటించడం చాలా తేలిక'​ అని అంటున్న కబీర్ సింగ్ హీరోయిన్ కియారా అడ్వాణీ

ABOUT THE AUTHOR

...view details