తెలుగు ట్రెండ్‌సెట్టర్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తీస్తున్నారు. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలోని 'బేఖయాలీ మే' అంటూ సాగే విరహ గీతం సంగీత ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
నెట్టింట దూసుకెళ్తున్న 'కబీర్ సింగ్' బ్రేకప్ పాట
ఇటీవలే విడుదలైన 'కబీర్ సింగ్' లోని 'బేఖయాలి మే' పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. షాహిద్- కియారా జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ పాట యూట్యూబ్‌లోకి వచ్చిన రెండు రోజుల్లోనే 18 మిలియన్లకు పైగా వీక్షణలను, అర మిలియన్‌కు పైగా లైకులను దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా షాహిద్ - కియారా మధ్య వచ్చే ఘాటైన ముద్దు సన్నివేశాలు యువతను ఆకర్షిస్తున్నాయి. భగ్న ప్రేమికుడిగా షాహిద్ కనబర్చిన హావభావాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ గీతానికి ఇర్షాద్ కమిల్ సాహిత్యాన్ని అందించగా.. స్వరకర్త సాచేత్ టాండన్ ఎంతో హృద్యంగా ఆలపించారు.
మాతృకను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగానే హిందీ వెర్షన్‌కు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.