తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆగస్టులో సెట్స్​పైకి 'కాతువాకుల రెండు కాదల్' - సమంత వార్తలు

విజయ్ సేతుపతి, సమంత, నయనతారలు ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'కాతువాకుల రెండు కాదల్'. ఈ సినిమాను ఆగస్టులో సెట్స్​పైకి తీసుకెళ్లబోతున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.

సమంత
సమంత

By

Published : May 24, 2020, 10:37 AM IST

రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంగా రూపొందనున్న తమిళ చిత్రం 'కాతువాకుల రెండు కాదల్‌'. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, సమంత, నయనతారలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులోనే సెట్స్ పైకి వెళ్లనుందని నిర్మాణసంస్థ తెలిపింది. ఇందులో పార్తిబన్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

ఏప్రిల్లోనే చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్లీ ప్రభుత్వాలు ఇప్పుడు కొన్ని షరతులతో కూడిన అనుమతులు కూడా ఇస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్ సంగీత సమకూరుస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు తొలుత ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా వ్యవహారాలన్నీ పూర్తిగా మారిపోయాయి.

కాతువాకుల రెండు కాదల్

ABOUT THE AUTHOR

...view details