తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తన సిబ్బందికి ముందుగానే జీతాలిచ్చిన జూ.ఎన్టీఆర్​! - లాక్‌డౌన్‌ తో ముందస్తుగానే ఎన్టీఆర్​ జీతాలిచ్చేసినట్లు టాక్​.

తన ఇంట్లో, కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి, జూ.ఎన్టీఆర్ ముందుగానే​ జీతాలిచ్చేసినట్లు సమాచారం. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే రూ.75 లక్షలు విరాళం అందించారు తారక్.

Jr NTR
ఎన్టీఆర్​

By

Published : May 8, 2020, 5:25 PM IST

కథానాయకుడు ఎన్టీఆర్..‌ తన ఇంట్లో, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ముందస్తుగా జీతాలు చెల్లించేశారు. కరోనా ప్రభావంతో లాక్​డౌన్ విధించడం వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఫీసులను మూసేశారు. ఈ నేపథ్యంలో తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యలు ఎదుర్కోకుండా‌ జీతాల్ని చెల్లించేశారట తారక్. అంతేకాకుండా ఎప్పుడు ఆర్థిక అవసరమొచ్చినా సాయం చేస్తానని చెప్పినట్లు‌ తెలుస్తోంది.

కరోనా కట్టడిపై పోరు కోసం ఎన్టీఆర్‌ ఇప్పటివరకు రూ.75 లక్షలు విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, సినీ కార్మికుల కోసం రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు.

ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే ఎన్టీఆర్..‌ లాక్‌డౌన్‌ వల్ల తన కుటుంబసభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత‌ 'ఆర్‌.ఆర్‌.ఆర్' షూటింగ్‌లో పాల్గొంటారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. వచ్చే ఏడాది, ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చూడండి : క్యాస్టింగ్​ కౌచ్​ గురించి మాట్లాడిన అదాశర్మ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details