తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విశాఖలో ప్రత్యక్షమైన 'కొమరం భీం' - rajamouli latest news

ఎన్టీఆర్​, రామ్​చరణ్​ తేజ్​ ప్రధాన పాత్రల్లో, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. ఇటీవల చిత్రీకరణ కోసం తారక్‌ విశాఖపట్టణం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. తారక్‌ని గుర్తు పట్టిన జనాలు అతడి లుక్‌ని చరవాణిలో బంధించటానికి పోటీ పడ్డారు. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట వైరల్​ అవుతున్నాయి.

jr ntr at vishaka ariport during at rrr movie shooting
విశాఖలో ప్రత్యక్షమైన 'కొమరం భీం'

By

Published : Dec 10, 2019, 3:09 PM IST

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ దశాబ్దకాలంలోనే అతిపెద్ద మల్టిస్టారర్​గా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. ఈ మూవీలో ప్రముఖ హీరోలు ఎన్టీఆర్​, రామ్​చరణ్​తేజ్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఒలివియా మోరిస్​ అనే నటి ఈ చిత్రంలో తారక్ సరసన నటించేందుకు ఎంపికైంది.

విశాఖపట్నం ఎయిర్​ పోర్ట్​లో ఎన్టీఆర్​

తాజాగా ఈ సినిమా చిత్రీకరణ కోసం తారక్‌ విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకున్నాడు అక్కడ తారక్‌ని గుర్తు పట్టిన జనాలు అతని లుక్‌ని చరవాణిలో బంధించటానికి పోటీ పడ్డారు. తారక్‌ చాలా వేగంగా బయటికి వెళ్ళినప్పటికి దొరికిన కొద్ది సమయంలో పోటోలు, వీడియోలు తీసేశారు. ఇదే కొమరం భీమ్‌ ఫస్ట్‌ లుక్‌ అని అభిమానులు సామజిక మాధ్యమాల్లో విశేషంగా స్పందిస్తున్నారు.

ఇప్పటి వరకు సినిమాలోని కథానాయకులకు సంబంధించిన లుక్‌ అధికారికంగా విడుదల చేయలేదు చిత్రబృందం. కొమరం భీం జయంతి రోజున తారక్‌ లుక్‌ విడుదల చేస్తారనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

ఇవీ చూడండి.. 'మంచి కెరీర్​ కావాలంటే సల్మాన్​ను ఫాలో అవ్వండి'

ABOUT THE AUTHOR

...view details