John abraham news: దేశంలో మళ్లీ కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. బాలీవుడ్లో ఇప్పటికే కరీనా కపూర్, అర్జున్‌కపూర్, సన్యా కపూర్ తదితరులు తమకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని చెప్పారు. ఇప్పుడు కథానాయకుడు జాన్ అబ్రహంతో పాటు అతడి భార్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.
మూడురోజుల క్రితం తాను ఓ వ్యక్తిని కలిశానని, అతడికి పాజిటివ్‌గా తేలడం వల్ల తాను, భార్య ప్రియ వైద్య పరీక్షలు చేసుకున్నామని జాన్ అబ్రహం తెలిపారు. తామిద్దరికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నామని చెప్పారు. అభిమానులందరూ మాస్క్‌లు ధరించి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.