తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పెళ్లి, క్రికెట్​ అర్థంకాని నాకే ఏడుపొచ్చింది' - jersey

నాని నటించిన 'జెర్సీ' సినిమా థ్యాంక్యూ మీట్ హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హీరో రానా హాజరయ్యాడు. 'క్రికెట్​, పెళ్లి, పిల్లలు లాంటి విషయాలు అర్థం కాని నాకే ఈ చిత్రం కంటతడి పెట్టించింది' అని  రానా చెప్పాడు.

జెర్సీ

By

Published : Apr 29, 2019, 8:23 AM IST

హైదరాబాద్​లో 'జెర్సీ' థ్యాంక్యూ మీట్

నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. తాజాగా ఈ సినిమా థ్యాంక్యూ మీట్ హైదరాబాద్​లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో రానా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

"జెర్సీ చిత్రం ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. తన కెరీర్​లో మైలురాయిగా నిలిచిపోతుంది" అని కథానాయకడు నాని అన్నాడు. చిత్రాన్ని ఇంతటి ఘన విజయం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞత తెలిపాడు.

హీరో రానా మాట్లాడుతూ.. "నాకు బేసిక్​గా క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు అసలు అర్థం కారు. ఇవన్నీ అర్థం కాని నాకే ఈ సినిమా చూసి ఏడుపొచ్చిందంటే ప్రేక్షకులు ఎలా ఫీల్​ అయ్యుంటారో అర్థం చేసుకోగలను. సినిమాపై నాని చూపే ప్రేమను చూస్తుంటే ముచ్చటేస్తుంది" అని అన్నాడు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు నాని, శ్రద్ధా శ్రీనాథ్​, దర్శకుడు గౌతమ్​ తిన్ననూరితో పాటు చిత్రబృదం పాల్గొంది. క్రికెట్​ నేపథ్యంలో పిరియడ్​ డ్రామాగా తెరకెక్కిన జెర్సీ చిత్రం విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details