నాని నటించిన 'జెర్సీ' జాతీయ ఉత్తమ తెలుగు చలన చిత్రంగా నిలిచింది. కేంద్రం ఈమేరకు 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను దిల్లీలో ప్రకటించింది.
జెర్సీలో హీరోహీరోయిన్లు నాని, శ్రద్ధా శ్రీనాథ్.. అద్భుతమైన నటన కనబరిచారు. ముఖ్యంగా నానికి, తన కుమారుడికి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. గౌతమ్ తిన్ననూరి తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం.. చిత్రవిజయంలో కీలక పాత్ర పోషించింది.