తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీ తర్వాత ఆ మార్క్​ను అందుకున్న బెల్లంకొండ! - jaya janaki nayaka hindi dubbing version

బెల్లంకొండ శ్రీనివాస్​-బోయపాటి శ్రీనివాస్​ కాంబోలో వచ్చిన 'జయ జానకి నాయక' రికార్డు సృష్టించింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్​ వెర్షన్​ 300 మిలియన్​ వ్యూస్​ దక్కించుకుంది. దీంతో బన్నీ తర్వాత ఈ మార్క్​ను అందుకున్న హీరోగా నిలిచాడు శ్రీనివాస్​.

jaya janaki nayaka
బెల్లంకొండ

By

Published : Sep 3, 2020, 6:00 PM IST

టాలీవుడ్​ సినిమాల హిందీ డబ్బింగ్​ వెర్షన్​లు యూట్యూబ్​లో దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్​ నటించిన 'సరైనోడు' ఇటీవల 300 మిలియన్​ వ్యూస్​ దక్కించుకున్న తొలి సినిమాగా రికార్డు సాధించింది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్​ 'జయ జానకి నాయక' 300 మిలియన్ల వ్యూస్​ను అందుకుంది. దీంతో బన్నీ తర్వాత ఈ మార్క్​ను అందుకున్న రెండో హీరోగా శ్రీనివాస్​ నిలిచాడు. ఈ రెండు సినిమాలను మాస్​ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించడం.. ఇందులో హీరోయిన్​గా రకుల్ ​ప్రీత్​ సింగ్​ నటించడం మరో విశేషం.

కాగా విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన 'డియర్‌ కామ్రేడ్‌' రికార్డు స్థాయి వీక్షణలు, లైక్స్​తో దూసుకెళ్తోంది. త్వరలోనే 'సరైనోడు', 'జయ జానకి నాయక' రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి సుశాంత్ బిల్​బోర్డు తొలగింపు.. శ్వేత ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details