తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలరిస్తున్న 'జాతిరత్నాలు' డిలిటెడ్​ సీన్​ - జాతిరత్నాలు

న‌వీన్​ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన 'జాతిరత్నాలు' సినిమాలోని డిలిటెడ్​ సన్నివేశాన్ని విడుదల చేసింది చిత్రబృందం. విపరీతంగా నవ్విస్తున్న ఈ సీన్​ను మీరూ చూసేయండి.

jatiratnalu
జాతిరత్నాలు

By

Published : Apr 3, 2021, 3:53 PM IST

జోగిపేట కుర్రాళ్లుగా 'జాతిరత్నాలు' సినిమాతో వెండితెరపై నవ్వుల సునామీ సృష్టించారు న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ. ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీగా వసూళ్లను అందుకుని బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది.

కె.వి.అనుదీప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ నిర్మాత. ఫరియా అబ్దుల్లా కథానాయిక. శనివారం ఈ సినిమాలోని డిలిటెడ్​ సన్నివేశాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తున్న ఈ సీన్​ను మీరూ చూసేయండి.

ఇదీ చూడండి :రివ్యూ: కడుపుబ్బా నవ్వించే 'జాతిరత్నాలు'!

ABOUT THE AUTHOR

...view details