బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారిని నవ్వించింది. ఈ క్రమంలో ఓ ఫ్యాన్ ఈ భామను ముద్దు అడగగా.. ఫన్నీగా సమాధానమిచ్చింది. తన ముఖానికి మాస్క్ ధరించిన ఫొటోను పంపించింది. 'కుదరదు(నో)' అంటూ పెద్ద సైజులో కామెంట్ జోడించింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది.
'కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి' అని మరో నెటిజన్ అడిగగా.. దీనికి ఓ ఫన్నీ వీడియోను జత చేసి పంపించింది. ఆ వీడియోలో.. దిండును గట్టిగా హత్తుకుని బాధ కలిగించే పాటలను పాడాలి అంటూ హాస్యభరితంగా బదులిచ్చింది. ఇది నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది. తనకు ఫేవరేట్ నటుడు పంకజ్ త్రిపాఠి, ఇష్టమైన సిరీస్ 'షిట్ క్రీక్' అని తెలిపింది.
ఇటీవలే హారర్ కామెడీ చిత్రం 'రూహి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం 'గుడ్‌లక్ జెర్రీ' చిత్రంలో నటిస్తోంది.
అంతకుముందు ఓ సారి అభిమానులతో తన ఇష్టాలను పంచుకుందీ జాన్వీ. అందులో కొన్ని ఇవి.
ఇష్టమైన హీరోలు: షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్.
ఇష్టమైన హీరోయిన్లు: దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా.