సాధారణంగా నటీనటులకు సినిమాల్లో ఉత్తమ నటనకు ఆస్కార్ అవార్డు ఇస్తారు. ఒక్కో చిత్రంలో ఒక్కో పాత్రకు వేరువేరుగా పురస్కారాలు అందజేస్తారు. కానీ మూడు సినిమాల్లో మూడు పాత్రల్లో నటనకు ఒకే ఆస్కార్ అందుకున్న నటి ఎవరో తెలుసా! అకాడమీ పురస్కారాలు ప్రకటించిన తొలి ఏడాదే జానెట్ గేనర్ అనే నటి మూడు సినిమాలకు కలిపి ఒకే అవార్డు అందుకుని రికార్డు సృష్టించింది.
సినీడైరీ: మూడు సినిమాలకు ఒకే ఆస్కార్
1929లో ప్రకటించిన తొలి ఆస్కార్ వేడుకలో మూడు సినిమాలకు ఒకే పురస్కారం అందుకున్న ఏకైక నటిగా జానేట్ గేనర్ అనే హాలీవుడ్ నటి రికార్డు సృష్టించింది. తర్వాత ఒక సినిమాలో ఒక పాత్రకు ఉత్తమ అవార్డు ఇవ్వడం ప్రారంభించింది అకాడమీ కమిటీ.
1929లో తొలిసారి ఆస్కార్ అవార్డులు ప్రకటించగా.. జానెట్ గేనర్ 'సెవెన్త్ హెవెన్', 'సన్రైజ్: ఏ సాంగ్ ఆఫ్ టూ హ్యూమన్స్', 'స్ట్రీట్ ఏంజెల్' చిత్రాల్లో నటనకు ఒకే ఆస్కార్ అందుకుంది. ఆ ఏడాది తర్వాత ఒక సినిమాలో ఒక పాత్రకు వేరు వేరుగా పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది అకాడమీ కమిటీ.
1937లో వచ్చిన 'ఏ స్టార్ ఈజ్ బోర్న్' సినిమాలో నటనకు రెండోసారి అకాడమీ నామినేషన్ అందుకుంది జానెట్. ఈ చిత్రాన్ని 2018లో రీమేక్ చేయగా.. మళ్లీ వరుసగా ఆస్కార్ నామినేషన్లు అందుకుంది ఏ స్టార్ ఈజ్ బోర్న్ చిత్రం.