జేమ్స్ బాండ్ నటి, ఉక్రెయిన్ మోడల్ ఓల్గా కురిలెంకో కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. నెటిజన్లకు జాగ్రత్తలు చెప్పింది. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినప్పటి నుంచీ ఇంట్లోనే ఉన్నానని, దాదాపు వారం నుంచి జ్వరం, అలసటతో ఇబ్బంది పడుతున్నానని రాసుకొచ్చింది.
జేమ్స్ బాండ్ భామనూ వదలని కరోనా - Coronavirus, Daniel Craig
జేమ్స్ బాండ్ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ ఓల్గా, కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. నెటిజన్లకు జాగ్రత్తగా ఉండమని సూచించింది.
ముద్దుగుమ్మ ఓల్గా
2008లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమా 'క్వాంటమ్ ఆఫ్ సోలేస్', 2013లో వచ్చిన 'ఒబ్లివియన్'లో నటించిందీ భామ. కొన్నిరోజుల క్రితం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్, అతడి భార్య రీటా విల్సన్‌కు కరోనా సోకింది. యూనివర్సల్ మ్యూజిక్ ఛైర్మన్, సీఈఓ లూసియన్ గ్రైంజ్.. ఈ వైరస్ కారణంగానే వారం రోజుల ముందు ఆస్పత్రిలో చేరారు.