తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రపంచంలోనే చిత్రపరిశ్రమ ఓ అందమైన మోసం' - బాలీవుడ్​లో బంధుప్రీతిపై జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ స్పందన

బాలీవుడ్​లో తనకు ఇప్పటికీ పని దొరుకుతున్న కారణంగా బంధుప్రీతి గురించి బాధపడట్లేదని తెలిపింది హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​. చిత్రపరిశ్రమ అనేది ప్రపంచంలోనే ఓ అందమైన మోసమని అభిప్రాయపడింది.

Jacqueline Fernandez calls Bollywood 'most beautiful fraud in the world'
'ప్రపంచంలోనే చిత్రపరిశ్రమ ఓ అందమైన మోసం'

By

Published : Jul 26, 2020, 2:55 PM IST

ప్రపంచంలోనే సినీపరిశ్రమ అందమైన మోసమని అంటోంది బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​. తనకు ఇంకా పని లభించడం వల్ల ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి తాజాగా వెల్లడించింది.

జాక్వెలిన్​ ఫెర్నాండెజ్

"చిత్ర పరిశ్రమ అనేది ప్రపంచంలోనే అత్యంత అందమైన మోసమని నేను గ్రహించా. నేను ఎక్కడి నుంచో వచ్చి.. పదేళ్లుగా బాలీవుడ్​లో కొనసాగుతున్నా. నటనలో ప్రదర్శనతో పాటు మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం నటులుగా మనకి అవసరం. ఉత్తమ ప్రతిభతో పాటు కష్టపడి వ్యక్తిగా పని చేయడం నేను నేర్చుకున్న ప్రధాన అంశం. సినిమా అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. వందలాది మంది ఇందులో భాగమౌతారు. ఈ క్రమంలో అనేక మందితో కలిసి పనిచేయగలగాలి. దీంతో కమ్యూనికేషన్​ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడమనేది నా దృష్టిలో అంతిమం. బంధుప్రీతి అనే అంశం నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకపోవడానికి కారణం నాకింకా పని దొరుకుతోంది. నేను చేయాలనుకున్న పని కాకపోయినా.. కానీ, అది నాకు అవసరం. అందుకే ఆ అంశం నన్ను ఎక్కువగా ప్రభావితం చేయలేదు.

-జాక్వెలిన్ ఫెర్నాండెజ్​, బాలీవుడ్​ నటి

బంధుప్రీతికి వ్యతిరేకం కాకపోయినా.. అభిమానం అనేది పెద్ద సమస్య అని వెల్లడించింది నటి జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​. భారతదేశంలో కాస్టింగ్​ విధానంలో లోపం ఉందని.. ఇలాంటి సంస్కృతి విదేశాల్లో లేదని అభిప్రాయపడింది. విదేశాల్లో అయితే కఠినమైన కాస్టింగ్​ బోర్డు ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ ఆడిషన్స్​ ద్వారా ఎంపికవుతారని.. కచ్చితంగా ఎవర్ని వారు నిరూపించుకోవాల్సిందేనని తెలిపింది. బాలీవుడ్​లో కఠినమైన కాస్టింగ్​ వ్యవస్థ ఉందో లేదో తనకు తెలియదని.. ద్వితీయ స్థాయి నటులకు ఇది పరిమితమై ఉండొచ్చని భావిస్తోంది హీరోయిన్ జాక్వెలిన్​.

ABOUT THE AUTHOR

...view details