గత కొంతకాలంగా కాబోయే వాడితో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేసిన ముద్దుగుమ్మ మెహరీన్(Mehreen).. తాము విడిపోతున్నామంటూ ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురి చేసింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనువడు భవ్య బిష్ణోయ్(Bhavya Bishnoi)తో నిశ్చితార్థం రద్దు చేసుకోవడం సహా బిష్ణోయ్, అతడి కుటుంబ సభ్యులతో ఇకపై ఎలాంటి సంబంధం ఉండబోదని తేల్చి చెప్పేసింది.
అయితే, ఉన్నట్టుండి మెహరీన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందోనని ఇప్పుడు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పెళ్లి తర్వాత సినిమాలు చేయొద్దని అత్తింటి వారు కోరినప్పటికీ మెహరీన్ మాత్రం సినిమాల్లో కొనసాగేందుకే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఇద్దరూ విడిపోవాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాళ్లు విడిపోవడానికి అసలైన కారణాలివేనా.. ఇంకేమైనా మనస్పర్థలున్నాయా తెలియాలంటే మెహరీన్ స్వయంగా చెప్పే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు విడిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే మెహరీన్ సోషల్ మీడియాలో భవ్య బిష్ణోయ్‌తో కలిసి దిగిన నిశ్చితార్థ ఫొటోలు.. ఆ తర్వాత పోస్టు చేసిన ఇతర ఫొటోలను తొలగించింది. పాత ఫొటోలు మాత్రం కొన్నింటిని అలాగే ఉంచింది.