ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. చాక్లెట్ బాయ్ కాస్త రఫ్ లుక్‌లో సందడి చేయనున్నాడు. ఈ సినిమాలోని జిందాబాద్ అంటూ సాగే లిరికల్ పాట ఆకట్టుకుంటోంది. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. దర్శకత్వం వహిస్తూ చార్మీతో కలిసి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు పూరీ జగన్నాథ్.
'జిందాబాద్.. జిందాబాద్ ఎర్రాని పెదవులకీ' - నభా నటేశ్
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో జిందాబాద్ జిందాబాద్ అంటూ సాగే లిరికల్ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
'జిందాబాద్.. ఎర్రని పెదవులకీ జిందాబాద్'
మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. మాల్దీవుల్లో ప్రస్తుతం రామ్, నిధి అగర్వాల్‌లపై ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు, పాటలకి మంచి స్పందన లభిస్తోంది.
ఇది చదవండి: 'చాంగు భళా.. చాంగు భళా.. ఇలాగా' అంటున్న హీరోయన్ సమంత