తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అప్పుడేమో 'రింగ రింగ'.. ఇప్పుడేమో 'సీటీమార్​'! - సీటీమార్​ పాట రీమేక సల్మాన్​

బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ మరోసారి అల్లు అర్జున్​ పాటను రీమేక్​​ చేయనున్నట్లు టాక్​. 'దువ్వాడ జగన్నాథమ్​' సినిమాలోని 'సీటీమార్'​ పాటను తన సినిమాలో వాడేందుకు సిద్ధమవుతున్నాడట భాయ్​జాయ్.

salman
సల్మాన్​

By

Published : Jun 8, 2020, 11:59 AM IST

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ మరోసారి స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పాట రీమిక్స్‌కు స్టెప్పులు వేయబోతున్నాడట. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'రాధే: ది మోస్ట్ వాంటెడ్‌ భాయ్‌'. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ, రణ్‌దీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మే 22న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా కుదరలేదు.

అయితే ఈ సినిమా కోసం 'దువ్వాడ జగన్నాథమ్‌' సినిమాలోని 'సీటీమార్‌..' పాటను రీమిక్స్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బన్నీ నటించిన 'ఆర్య 2'లోని 'రింగ రింగ..' పాటను సల్మాన్‌ 'రెడీ' సినిమా కోసం రీమిక్స్‌ చేశాడు. 'డింకచికా.. డింకచికా..'గా పాటను రూపొందించారు.

ఇప్పుడు మరోసారి సల్మాన్‌ టాలీవుడ్‌ పాటకు స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ రీమిక్స్‌ కోసం పనిచేస్తున్నాడట. వీరిద్దరూ 2011లో 'డింక చికా..' పాట కోసం కలిసి పనిచేశారు.

ఇది చూడండి : ఏ సిరి పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. యాపిల్ సిరితో అయాన్

For All Latest Updates

TAGGED:

salman

ABOUT THE AUTHOR

...view details