తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలోనే గుడిలో నయనతార పెళ్లి​! - త్వరలోనే గుడిలో పెళ్లిచేసుకోబోతున్న నయన్​!

స్టార్​ హీరోయిన్​ నయనతార.. త్వరలోనే తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్​ శివన్​ను పెళ్లి చేసుకోనుందని సమాచారం. తమిళనాడులోని ఓ గుడిలో వీరి వివాహం జరగనుందనట.

nayantara
నయనతార-విఘ్నేశ్​

By

Published : Jun 6, 2020, 4:59 PM IST

Updated : Jun 6, 2020, 7:28 PM IST

అగ్రకథానాయిక నయనతార.. త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుందంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను ఆమె పెళ్లి చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోని ఓ గుడిలో త్వరలో వివాహం చేసుకోనున్నారని.. పరిమిత సంఖ్యలో బంధువులు మాత్రమే హాజరవుతారని సమాచారం.

ఈ శుభవార్తతో నయన్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నయన్‌-విఘ్నేశ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. అయితే తమ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నయన్‌ కానీ, విఘ్నేశ్‌ కానీ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

నయనతార-విఘ్నేశ్​

2015లో వచ్చిన 'నేనూ రౌడీనే' సినిమా కోసం దర్శకుడు విఘ్నేశ్‌తో కలిసి పనిచేసింది నయన్. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమలో పడ్డారు. వీరు కలిసి దిగిన పలు ఫొటోలను విఘ్నేశ్‌.. అప్పుడప్పుడు ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం నయన్‌.. 'నెట్రికారన్‌', 'కాతువక్కుల రెండు కాదల్‌', 'ముక్తి అమ్మన్‌' చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి : చీపురు పట్టి అమ్మకు సాయం చేసిన సితార

Last Updated : Jun 6, 2020, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details