తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కత్రినా కైఫ్ హగ్​ చేసుకుంది విక్కీనేనా? - విక్కీ కౌశల్ కత్రినా

బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా తన ఇన్​స్టాలో కత్రిన పెట్టిన ఓ పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.

Is Katrina Kaif Hugging Vicky Kaushal In This Pic?
కత్రినా కైఫ్ హగ్​ చేసుకుంది విక్కీనేనా?

By

Published : Jan 29, 2021, 10:57 AM IST

Updated : Jan 29, 2021, 12:10 PM IST

బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌.. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో విలక్షణ కథలతో దూసుకెళ్తోన్న యువ నటుడు. అతడు నటించిన 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’' చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మేజర్‌ విహాన్‌ సింగ్‌ సెర్గిల్‌గా నటించి మెప్పించాడు. అయితే విక్కీ, బాలీవుడ్​ బార్బీ కత్రినా కైఫ్‌ల ప్రేమ బంధంపై కొన్ని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్​లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో సందడి చేస్తున్నారు నెటిజన్లు.

తాజాగా తన ఇన్​స్టాలో ఓ పోస్టు పెట్టింది కత్రినా కైఫ్. ఇందులో తను ఎవరినో హగ్ చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఫొటోకు సీతాకోకచిలకల్ని జోడించి తాను గాల్లో తేలిపోతున్నట్లు చెప్పకనే చెప్పింది. అయితే ఈ ఫొటోను చూసిన నెటిజన్లు కత్రిన కౌగిలించుకుంది విక్కీనేనని ఆధారాలతో సహా కామెంట్లు పెడుతున్నారు. కత్రిన హగ్ చేసున్న అతడి షర్ట్​.. విక్కీ ఓ సందర్భంలో వేసుకున్న షర్ట్ ఒకటే కావడం గమనార్హం.

కత్రిన ఇన్​స్టా స్టోరీ

2019 నుంచి వీరిద్దరూ డేటింగ్​లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది ఇషా అంబానీ హోలీ పార్టీతో పాటు పలు వేడుకల్లో వీరు సందడి చేశారు. విక్కీ నటించిన 'భూత్-ద హాంటెడ్ షిప్'​ స్పెషల్ స్క్రీనింగ్​కూ కత్రిన హాజరైంది. ప్రస్తుతం వీరిద్దరూ 'ఫోన్ భూత్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇషాన్ ఖత్తర్​ కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

Last Updated : Jan 29, 2021, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details