తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'డ్రగ్స్ ఇచ్చి నాపై అత్యాచారానికి పాల్పడ్డారు' - సంగీతం

తనపై గతంలో కొన్నివారాల పాటు అత్యాచారం చేశారని, మాదకద్రవ్యాలు ఇచ్చి బందీని చేశారని వెల్లడించింది గాయని, నటి డఫీ. ఆ విషయాల్ని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

I's drugged, raped, recounts Duffy
అత్యాచారం వల్ల మానసికంగా కుంగిపోయా: గాయని డఫీ

By

Published : Apr 8, 2020, 10:14 AM IST

ప్రముఖ పాప్​ సింగర్​ డఫీ.. తన జీవితంలో చోటుచేసుకున్న బాధాకర విషయాల్ని ఇటీవలే పంచుకుంది. గతంలో ఓసారి తనపై కొన్నివారాలు అత్యాచారం చేయడం సహా మాదకద్రవ్యాలు ఇచ్చి బందీగా చేసి హింసించారని చెప్పింది. తనలాంటి బాధితులకు అండగా నిలిచేందుకు ఇప్పుడీ విషయాల్ని బయటపెట్టినట్లు పేర్కొంది.

"ఆ రోజు నా పుట్టినరోజు. పార్టీ చేసుకునేందుకు ఓ రెస్టారెంట్​కు వెళ్లా. అప్పుడు ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. స్పృహ కోల్పోయిన తర్వాత వేరే దేశానికి తీసుకెళ్లిపోయారు. కనీసం విమానం ఎక్కడమైనా గుర్తులేదు. అక్కడ నుంచి ఓ ప్రదేశానికి చేరుకున్న అనంతరం వేరే వాహనంలో ఓ హోటల్​కు తరలించారు. అక్కడ ఓ గదిలో ఓ వ్యక్తి నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దానితోపాటే మాదక ద్రవ్రాలు ఇచ్చి, బందీగా చాలా రోజులు అక్కడే హింసించాడు" -డఫీ, ప్రముఖ పాప్ సింగర్

ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత బాధితులు, నలుగురిలోకి వచ్చేందుకు భయపడతారని చెప్పింది డఫీ. తాను మాత్రం ఇకపై ధైర్యంగా ఉంటానని, తనలాంటి ఎంతోమంది బాధితులకు అండగా నిలుస్తానని తెలిపింది.

అయితే తన విషయంలో ఈ ఘటన జరిగిన తర్వాత ఇంటికి ఎలా చేరుకున్నానో గుర్తులేదని, పోలీసులను సంప్రదించేందుకు భయపడినట్లు చెప్పింది డఫీ.

ఇదీ చదవండి:ఈ సారి ఈద్​కు సల్మాన్​ఖాన్ సినిమా కష్టమే!

ABOUT THE AUTHOR

...view details